ePaper
Friday, March 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంవిదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..

విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..

📰 Generate e-Paper Clip

భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు.

ఇంటర్‌నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ విదేశీ మహిళ పర్యటన నిమిత్తం ఇండియా వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాష్ట్రంలో పర్యటిస్తోంది. తాజాగా, జైపూర్‌‌లోని జల్ మహాల్‌ను చూడ్డానికి వెళ్లిన ఆమెను స్థానిక యువకులు చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకోవడానికి అత్యుత్సాహం చూపారు.కొంతమంది యువకులు ఆమె భుజాలపై చెయ్యి వేసి మరీ సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. మరి కొంతమంది ఇదే అదునుగా ఆమెను అసభ్యంగా తాకారు. ఆ విదేశీయురాలు చాలా ఇబ్బందికి గురైంది. అక్కడినుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించింది. అయినా కూడా వాళ్లు వదలలేదు. ఆమెను ఆపి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దివ్య గండోత్ర ఠండన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ‘జైపూర్‌లోని జల్ మహాల్‌ దగ్గర స్థానికులు విదేశీ మహిళను వేధించారు. జనం ఆసక్తి, గౌరవంతో ఇండియాకు వస్తున్నారు. భయం, ట్రోమాతో తిరిగి వెళుతున్నారు’ అంటూ మండిపడింది.
దివ్య షేర్ చేసిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్ట కూడదు. విదేశీ మహిళలంటే ఆట వస్తువులు అనుకుంటున్నారు’..‘వీరి కారణంగానే ఇండియాకు చెడ్డ పేరు వస్తోంది. విదేశీయులు ఇండియాకు రావాలంటేనే భయపడుతున్నారు’..‘టూరిస్ట్ ప్లేసుల్లో విదేశీయులకు తప్పకుండా రక్షణ కావాలి. ముఖ్యంగా ఇలాంటి చెత్త మనుషుల నుంచి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!