ePaper
Friday, March 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాయవరం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రులు..

రాయవరం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రులు..

📰 Generate e-Paper Clip

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం బస్సు ప్రమాద బాధితులను ఏపీ మంత్రులు పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లే దాకా చంద్రబాబు సర్కార్ బాధ్యత తీసుకుంటుందని వారు తెలిపారు.

ప్రకాశం మార్చి 27 (మహాప్రభ) : మార్కాపురం మండలం రాయవరం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్సపొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అధికారులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎవ్వరూ అధైర్య పడొద్దని బాధిత కుటుంబాలకు మంత్రులు హామీ ఇచ్చారు. పరామర్శ అనంతరం మంత్రులిద్దరూ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ‘మార్కాపురంలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. హోమ్ మినిస్టర్ అనిత, రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని ఘటనా స్థలానికి పంపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం వెంటనే స్పందించారు. ప్రస్తుతం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్ అందరూ స్పందించారు’ అని చెప్పారు.

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. క్షతగాత్రులు కోలుకుని ఇంటికి వెళ్లే దాకా చంద్రబాబు సర్కార్ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాయని ఆయన పేర్కొన్నారు. అలాగే గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం రూ.2లక్షలు, కేంద్రం రూ.50వేలు ప్రకటించాయని చెప్పారు. బాధితులంతా కూలి పనులు చేసుకునే పేదవాళ్లని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందగా.. 28 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!