ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరాజకీయంరజనీని బాధ పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

రజనీని బాధ పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

📰 Generate e-Paper Clip

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. రజనీని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని అన్నారు.

మార్చి 18 మహాప్రభ : సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. రజనీని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని అన్నారు. బుధవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అర్జున.. రజనీపై తన వ్యాఖ్యల గురించి స్పందించారు (TVK leader apology to Rajinikanth).’నా నాయకుడు (విజయ్)కు నాయకుడైన రజనీకాంత్‌ను కించపరచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అది డీఎంకే కుట్ర అని మాత్రమే చెప్పాను. రజనీ నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. నా వ్యాఖ్యలు ఆయనకు బాధ కలిగించాయని అర్థమవుతోంది. కానీ, అక్కడ నా ఉద్దేశం అది కాదు. ఈ వివాదం నాకు చాలా విచారం కలిగించింది’ అని అదవ్ అర్జున అన్నారు. ఇటీవల అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సమయంలో డీఏంకే నేతలు ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అలాంటి ఒత్తిళ్లకు విజయ్ తలొగ్గరని అన్నారు (DMK threat comment).డీఎంకే బెదిరింపులకు భయపడి రజనీ వెనకడుగు వేశారనే అర్థం వచ్చేలా, అర్జున చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి (Political controversy Tamil Nadu). డీఎంకే నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. రజనీ కూడా అర్జున వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీవీకే ఉన్నతస్థాయి నేత ఒకరు నా మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే.. కాలం సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది’ అని ఎక్స్ వేదికగా రజనీకాంత్ స్పందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!