ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన కొరియన్ ఆన్‌లైన్ గేమ్ : Mahaaprabha

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన కొరియన్ ఆన్‌లైన్ గేమ్ : Mahaaprabha

📰 Generate e-Paper Clip

ఆన్‌లైన్ కొరియన్ గేమ్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు.

ఇంటర్‌నెట్ డెస్క్  ఫిబ్రవరి 4  మహాప్రభ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పఖి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్ని పనులు కలిసే చేసేవారు. కలిసి తినేవారు, స్నానం చేసేవారు, స్కూలుకు వెళ్లేవారు, నిద్రపోయే వారు.

కోవిడ్ సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు టాస్క్ బేస్డ్ కొరియన్ ఆన్‌లైన్ గేమ్ ‘కొరియన్ లవర్’కు బానిసలుగా మారారు. గంటలు, గంటలు గేమ్ ఆడుతూ గడిపేవారు. అంతేకాదు.. తమ పేర్లు మార్చుకుని కొరియన్ పేర్లు పెట్టుకున్నారు. గేమ్‌ అడిక్షన్ కారణంగా స్కూలుకు కూడా సరిగా వెళ్లేవారు కాదు. పిల్లలు పూర్తిగా గేమ్‌కు బానిసలుగా మారటంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. వారిని ఇకపై గేమ్ ఆడవద్దని మందలించారు. దీంతో ముగ్గురూ మనస్తాపానికి గురయ్యారు. గేమ్ ఆడకుండా బతకలేమని భావించారుఈ నేపథ్యంలోనే ముగ్గురూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం 8 పేజీల సూసైడ్ నోట్ రాశారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో 9వ అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్ కిటికీ నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. బిల్డింగ్ దగ్గర పెద్ద శబ్ధం రావటంతో స్థానికులు అక్కడికి వచ్చారు. నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న వారిని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.మాస్ సూసైడ్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కాచెల్లెళ్ల గదిలోకి వెళ్లి పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్‌లో వారు తమ బాధనంతా వివరంగా రాసుకొచ్చారు. తల్లిదండ్రులకు క్షమాపణ సైతం చెప్పారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలిదంటే.. ప్రాచీ విపరీతంగా మొబైల్ ఫోన్ వాడేది. ఆమె కారణంగానే మిగిలిన ఇద్దరూ ఆన్‌లైన్ గేమ్ ‘కొరియన్ లవర్’కు బానిసలుగా మారారు. చివరకు గేమ్ అడిక్షన్ కారణంగానే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!