ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంమహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఢిల్లీ, మార్చి 11 మహాప్రభ : మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో సవరణలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది.ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!