ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిమళ్లీ అదే చోట కారు బోల్తా

మళ్లీ అదే చోట కారు బోల్తా

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.

  • ఒకరికి తీవ్రగాయాలు

గంగవరం(అన్నమయ్య) మార్చి 10 మహాప్రభ : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరుకు చెందిన మునీంద్రారావు తన కుటుంబసభ్యులతో సోమవారం కారులో తిరుమల(Tirumala) బయలుదేరారు. పలమనేరు- బెంగళూరు జాతీయ రహదారిలో దండపల్లె జంక్షన్‌ వద్ద కారు వేగంగా వస్తూ సర్వీసురోడ్డుపై పడి ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొంది.

ఈక్రమంలో కారు సుమారు 50 మీటర్ల దూరంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారులో ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో అందులోని నలుగురూ ప్రాణాలతో బయటపడ్డారు. ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు బెలూన్లు ఓపెన్‌ కావడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంభూపాల్‌ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!