ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంమరింత మంది అమెరికా సైనికులు మరణించినా.. ఇరాన్ యుద్ధం ముందుకే: డొనాల్డ్ ట్రంప్

మరింత మంది అమెరికా సైనికులు మరణించినా.. ఇరాన్ యుద్ధం ముందుకే: డొనాల్డ్ ట్రంప్

📰 Generate e-Paper Clip

ఇరాన్‌తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చని, ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మార్చి 2 మహాప్రభ : ఇరాన్‌తో యుద్ధం మరో నాలుగు, ఐదు వారాలు జరగొచ్చని, ఆ యుద్ధం ముగిసేలోపు మరింత మంది ఎక్కువ అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ మరికొద్ది రోజుల పాటు పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్నారు. అలాగే అమెరికా సైనికుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు (Trump Iran war).
‘ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారు. మా సైనికుల మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. యుద్ధం ముగిసేలోపు మరింత మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. అయినా ముందుకే వెళ్తాం. ఈ దాడుల వల్ల ఇరాన్‌లో 200 మంది మరణించినట్టు తెలిసింది. ఇరాన్ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పించేందుకు సిద్ధం. లేదంటే వారికి చావు తప్పదు. అలాగే చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు (US military strikes Iran).అలాగే తనపై జరిగిన హత్యాయత్నాల గురించి కూడా ట్రంప్ స్పందించారు (America Iran tensions). ‘ఖమేనీ ప్రోద్బలంతో నాపై ఇప్పటికి రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయితే, నేను మొదటి ప్రయత్నంలోనే అతడి కథను ముగించా. నన్ను పట్టుకోకముందే, నేను అతడిని పట్టుకున్నా. ఇరాన్‌పై విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. ఆ ఆపరేషన్ 4-5 వారాలు కొనసాగొచ్చు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద కష్టం కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!