ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్భారత్‌తో తొలి వన్డే.. ఆస్ట్రేలియా ఘన విజయం

భారత్‌తో తొలి వన్డే.. ఆస్ట్రేలియా ఘన విజయం

📰 Generate e-Paper Clip

మూడు వన్డేల్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 38.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి ఛేదించింది.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : మూడు వన్డేల్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు బ్రిస్బేన్ వేదికగా నేడు తొలి వన్డేలో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మహిళలు.. 38.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి ఛేదించారు. బెత్ మూనీ(76; 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ(50; 70 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఆదిలో కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన భారత బౌలర్లు ఆఖరి వరకు ఆ దూకుడును కొనసాగించలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(32), అనెబెల్ సదర్లాండ్(48*) రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన(58), హర్మన్ ప్రీత్ కౌర్(53) హాఫ్ సెంచరీలు చేశారు. కాష్వీ గౌతమ్(43) రాణించింది మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డ్‌నర్ 3, మెగాన్ 2, అలాన్ కింగ్, మెక్‌గ్రాత్, సోఫీ తలొక వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఈ విజయంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!