ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంభగ్గుమన్న పసిడి ధర! రూ.3 లక్షల మార్కును చేరిన వెండి

భగ్గుమన్న పసిడి ధర! రూ.3 లక్షల మార్కును చేరిన వెండి

📰 Generate e-Paper Clip

సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును దాటింది.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 23 మహాప్రభ: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో సోమవారం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,350కు చేరింది. నిన్నటితో పోలిస్తే రేటు ఏకంగా రూ.2,070ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.1,900ల మేర పెరిగి రూ.1,47,900కు చేరింది. వెండి ధర కూడా అమాంతం పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర ఏకంగా రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది (Gold, Silver Rates in India on Feb 23).

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,62,110; ₹1,48,600
  • ముంబై: ₹1,61,350; ₹1,47,900
  • ఢిల్లీ: ₹1,61,500; ₹1,48,050
  • కోల్‌కతా: ₹1,61,350; ₹1,47,900
  • బెంగళూరు: ₹1,61,350; ₹1,47,900
  • హైదరాబాద్: ₹1,61,350; ₹1,47,900
  • విజయవాడ: ₹1,61,350; ₹1,47,900
  • కేరళ: ₹1,61,350; ₹1,47,900
  • పుణె: ₹1,61,350; ₹1,47,900
  • వడోదరా: ₹1,61,400; ₹1,47,950
  • అహ్మదాబాద్: ₹1,61,400; ₹1,47,950

కిలో వెండి ధరలు

  • చెన్నై: ₹3,00,000
  • ముంబై: ₹3,00,000
  • ఢిల్లీ: ₹2,98,000
  • కొలకతా: ₹2,98,900
  • బెంగళూరు: ₹3,00,000
  • హైదరాబాద్: ₹3,00,000
  • విజయవాడ: ₹3,00,000
  • కేరళ: ₹2,89,900
  • పుణె: ₹3,00,000
  • అహ్మదాబాద్: ₹2,94,000

గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!