ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంబెంగాల్ ఎస్ఐఆర్‌పై సుప్రీం సంచలన ఆదేశాలు.. న్యాయాధికారుల నియామకానికి ఆదేశం

బెంగాల్ ఎస్ఐఆర్‌పై సుప్రీం సంచలన ఆదేశాలు.. న్యాయాధికారుల నియామకానికి ఆదేశం

📰 Generate e-Paper Clip

ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్‌ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్‌కతా హైకోర్టును ఆదేశించింది.

న్యూఢిల్లీ ఫిబ్రవరి 20 మహాప్రభ : ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్‌ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సవరణపై దురదృష్టకరమైన విమర్శల ఆట కొనసాగుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్‌కతా హైకోర్టును ఆదేశించింది. ఎస్ఐఆర్‌లో అభ్యంతరాలు, వివాదాలను జ్యుడిషియల్ ఆఫీసర్లు పరిష్కరిస్తారని పేర్కొంది.’రాజ్యంగ బద్ధ వ్యవస్థలైన రాష్ట్రం, ఎన్నికల కమిషన్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ అభ్యంతరాలు, వివాదాల మధ్య చిక్కుకుంది’ అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కోసం పనిచేస్తున్న జిల్లా జడ్జి హోదాలో ఉన్న మాజీ న్యాయాధికారులను కూడా ఈ ప్రక్రియ కోసం నియమించాలని, అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయాధికారుల నియామకం, బాధ్యతలకు సంబంధించి సమగ్ర ప్లాన్ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో శనివారంనాడు సమావేశం కావాలని ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీ, పోలీస్ చీప్, ఇతర ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

కీలక వ్యాఖ్యలు

జ్యుడిషియల్ ఆఫీసర్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు వేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశించాం. అయితే కమ్యూనికేషన్ విషయంలో వ్యవహరించే తీరు ఇదేనా? ఫిబ్రవరి 9వ తేదీ ఆదేశాలకు ఫిబ్రవరి 17న స్పందించారు. 8,500 ఆఫీసర్లను పంపామంటారు. మేము మైక్రో అబ్జర్వర్లం కాదు. ఈ వ్యవహారం మాకు తీవ్ర అంసతృప్తిని కలిగిస్తోంది. రాష్ట్రాలు సహకరిస్తాయని మేము భావిస్తాం. మాకు ప్రైవేటు వివరణలు అవసరం లేదు’ అని సీజేఐ అన్నారు.ఎస్ఐఆర్‌పై జరుపుతున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇటీవల ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులతో సమావేశానంతరం బహిరంగంగానే ఆమె హెచ్చరికలు చేశారు. ఎన్నికల కమిషన్ ముందు లక్షలాది మంది బాధితులను పెరేడ్ చేయిస్తామన్నారు. మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఈసీ మండిపడింది. ఎన్నికల అధికారికులు ఎంతో సంయమనంతో గౌరవంతో ఆమెతో మాట్లాడినట్టు తెలిపింది. అయితే బెంగాల్ ఓటర్ల జాబితా క్లీనప్ పేరుతో నిజమైన ఓటర్లను జాబితా నుంచి మినహాయించారని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించలేదని నిలదీశారు. ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!