భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.

లిస్ట్‌లో 30 మంది పేర్లు..గతేడాది మొత్తం 34 మంది ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టుల్లో చేర్చారు. ఈ ఏడాది 30 మంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తాజాగా ఈ జాబితాలో చేరగా.. ముగ్గురు ఆటగాళ్లు గ్రేడ్-ఏలో ఉండగా, 11 మంది గ్రేడ్-బిలో, 16 మంది గ్రేడ్-సిలో చోటు దక్కించుకున్నారని సమాచారం. ఈ ఒప్పందం 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.
మీడియా నివేదికల ప్రకారం..
- గ్రేడ్-A: శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
- గ్రేడ్-B: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్
- గ్రేడ్-C: అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, ధ్రువ్ జురేల్, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్
