ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంబీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే : Mahaaprabha

బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే : Mahaaprabha

📰 Generate e-Paper Clip

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మహాయుతి కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డేను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు.

ముంబై , ఫిబ్రవరి 7  మహాప్రభ : బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ (Mayor) పదవికి మహాయుతి కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే (Ritu Tawde)ను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు. షిండే శివసేన నేత సంజయ్ శంకర్ ఘాడి (Sanjay Shankar Ghadi)ని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశామని తెలిపారు.రితూ తావ్డే మూడుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. బీఎంసీ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. సంజయ్ శంకర్ ఘాడి 15 నెలలుగా 5వ నెంబర్ వార్డు మెంబర్‌గా ఉన్నారు. 2022లో శివసేనలో చీలిక ఏర్పడినప్పుడు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన వారిలో ఆయన కూడా ఉన్నారు.బీఎంసీతో సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు గత జనవరి 15న ఎన్నికలు జరుగగా, 16న ఫలితాలు వెలువడ్డాయి. 227 మంది సభ్యుల బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 118 స్థానాలతో మెజారిటీ కంటే నాలుగు స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది.మహాయుతి కూటమిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసి 3 సీట్లు గెలుచుకుంది. వీటితో కలిపి మహాయుతి కూటమి బలం 121కి చేరింది.కాగా, గత 25 ఏళ్లుగా బీఎంసీని ఏలిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన 65 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 24, రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) 6 సీట్లు దక్కించుకున్నాయి. ఏఐఎంఐఎం-8, సమాజ్‌వాదీ పార్టీ-2 సీట్లు గెలుచుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎంఎన్‌ఎస్ ఈసారి కలిసి పోటీ చేయగా, కాంగ్రెస్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఒంటరిగా పోటీ చేశాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!