ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంబంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం.

📰 Generate e-Paper Clip

ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీ ఫిబ్రవరి 18 మహాప్రభ : ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. ఇండియా గేట్, కర్తవ్య మార్గ్, అక్షరధామ్ ఆలయం ప్రాంతంలో వర్షం పడటంతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రధాన రహదారుల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చాలా సేపటి వరకూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సీజన్ లో మొదటిసారిగా ఢిల్లీలో గరిష్ఠంగా 31.6 డిగ్రీల సెల్సియస్(31.6°C ) ఉష్ణోగ్రత నమోదైంది.

గత ఐదు సంవత్సరాలలో ఫిబ్రవరి మాసంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ (30°C) దాటడం ఇదే తొలిసారని డేటా చెబుతోంది. చివరిసారిగా 2021, ఫిబ్రవరి 11న 30.4 డిగ్రీల సెల్సియస్(30.4°C)గా నమోదైంది. మరోవైపు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 18, 19 రెండు రోజులు వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!