ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeచెన్నైబంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

📰 Generate e-Paper Clip

శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అయింది.

ఏప్రిల్ 6 (మహాప్రభ) :అంతర్జాతీయ మార్కెట్‌పై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను వెంటనే తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని, ఇరాన్‌కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో మార్కెట్ కుదేలైంది. యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుందని ట్రంప్ చెప్పడం మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. బంగారం ధరలు కుప్పకూలాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అయింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. 24 క్యారెట్లపై రూ. 1800.. 22 క్యారెట్లపై రూ.1650..18 క్యారెట్లపై రూ. 1350 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,130.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,700.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,49,130
  • విజయవాడ: రూ.1,49,130
  • విశాఖపట్నం: రూ.1,49,130
  • ముంబై: రూ.1,49,130
  • బెంగళూరు: రూ.1,49,130
  • ఢిల్లీ: రూ.1,49,280
  • చెన్నై: రూ.1,50,660
  • సూరత్: రూ.1,49,180
  • మధురై: రూ.1,50,660
  • కోయంబత్తూరు: రూ.1,50,660
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!