ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అదే కారణమా?

ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అదే కారణమా?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్, ఫిబ్రవరి 25 మహాప్రభ : హైదరాబాద్(Hyderabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి(Komali) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్న కోమలి.. చిత్రపురి కాలనీలో తన బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికి చెందిన కోమలి.. తక్కువ కాలంలో యూట్యూబర్‌(YouTuber)గా మంచి పేరు సంపాదించుకుంది.కోమలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని ప్రేమించింది. ఏడాది క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కోమలి ఆత్మహత్యకు యత్నించగా.. బంధువులు కాపాడారు. ఈ మధ్య మరోసారి ఆ యువకుడితో గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుంది. ఆమె తల్లి మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!