ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

📰 Generate e-Paper Clip

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్‌ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం.

స్పోర్ట్స్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మార్చి26న ఈ లీగ్ ప్రారంభం కాగా.. అంతకంటే ముందు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్‌ను వీడి.. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని పాక్ అవమానంగా ఫీలై.. పీఎస్ఎల్‌ను వీడిని ప్లేయర్లపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగింది. ఇదే సమయంలో పాక్‌కు మరో ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఏమాత్రం అవకాశం దొరికినా పీఎస్‌ఎల్‌ను వీడి.. ఐపీఎల్‌లో చేరడానికి చాలా మంది విదేశీయ ఆటగాళ్లు వెనుకాడటం లేదు. జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ(Blessing Muzarabani) పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో కేకేఆర్‌ జట్టులో చేరగా.. శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక సైతం ఇదే బాటలో నడిచాడు. తాజాగా ఈ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ నైట్‌ తొలుత పీఎస్‌ఎల్‌ కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్నాడు. తాజాగా అతడి పేరు ఐపీఎల్‌ 2026 కామెంట్రీ ప్యానెల్‌లో కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు కామెంటేటర్లు కూడా పీఎస్‌ఎల్‌ వీడి ఐపీఎల్‌తో జట్టు కడుతున్నారని క్రీడా నిపుణులు అంటున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ కామెంట్రీ ప్యానెల్‌లో భారత దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి, వీరేందర్‌ సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, రవిచంద్రన్‌ అశ్విన్‌ తదితరులతో కలిసి నిక్‌ నైట్‌(Nick Knight) సందడి చేయనున్నాడు.

ఇక పీఎస్ఎల్‌ను వీడిన జింబాబ్వే పేసర్ ముజరబానీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో, శ్రీలంక ఆటగాడు షనక రాజస్తాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) జట్టులో చేరారు. అలానే ఆస్ట్రేలియా పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ నాథన్‌ ఎల్లిస్‌ స్థానంలో సీఎస్‌కేలోకి వచ్చాడు. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లే నిర్వహిస్తున్న పీసీబీకి.. ఆటగాళ్లు, కామెంటేటర్లు అర్ధాంతరంగా వెళ్లిపోవడం తలనొప్పిగా మారింది. ఇలా పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్ మ్యాచ్‌లు జరుగుతోన్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!