ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పసిడి ధర.. మరింతగా పతనం!

పసిడి ధర.. మరింతగా పతనం!

📰 Generate e-Paper Clip

నేడు బంగారం ధరలు మరింతగా తగ్గాయి. డాలర్ బలంగా ఉండటం, ప్రాఫిట్ బుకింగ్, ఫెడ్ వడ్డీ కోతపై తగ్గుతున్న ఆశలు పసిడి ధర పతనం అయ్యేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 24 మహాప్రభ : భారత్‌లో నేడు (మార్చి 24) కూడా బంగారం ధర తిరోగమనంలో పయనిస్తోంది. మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,940ల మేర పతనమైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) రూ.2,940ల మేర తగ్గి రూ.1,40,650కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా రూ.2,700 మేర కోత పడింది. ప్రస్తుతం ధర రూ.1,28,650గా ఉంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.4 లక్షల వద్ద ట్రేడవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!