ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంపట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు : Mahaaprabha

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు : Mahaaprabha

📰 Generate e-Paper Clip

చెన్నై సెంట్రల్ – న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటర్‌నెట్ డెస్క్‌ , ఫిబ్రవరి5 మహాప్రభ : ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌ జిల్లాలోని జఖపుర రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై సెంట్రల్ – న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పట్టాల నుంచి కిందకు జారిపోయాయి. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు నెమ్మదిగా వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పిందిరైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు.. జఖపుర రైల్వే స్టేషన్‌ వద్ద రైలు పట్టాలు తప్పింది. దీంతో ఓ ఏసీ బోగీ, రెండు సాధారణ బోగీలు పట్టాల నుంచి పక్కకు వచ్చేశాయి. బోగీలు పట్టాలు తప్పటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రక్‌ నుంచి రెస్క్యూ, పునరుద్ధరణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు మొదలుపెట్టాయి. అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారుప్రమాదం జరిగిన రైలు పట్టాలపై పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ట్రాక్‌లను శుభ్రం చేసి, సాధారణ రైలు సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఇంజినీరింగ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ రైలు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పునరుద్ధరణ పనులు పూర్తై.. రైలు సేవలు సాధారణ స్థితికి వచ్చాక పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!