రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు.
ఏప్రిల్ 11 (మహాప్రభ) :రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో కూడా భారీ సిక్స్‌లు కొట్టాడు (Vaibhav Sooryavanshi).
తాజాగా తన ఆటతీరు గురించి వైభవ్ మాట్లాడాడు. ‘నేను బంతిని మాత్రమే చూసి ఆడతాను. బౌలర్‌ను కాదు. ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. నేను చివరి వరకు ఉండుంటే మరో 20 పరుగులు చేసేవాడిని. అది జట్టుకు మరింత ఉపయోగపడేది. మా నాన్న, కోచ్‌లు నిరంతరం నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు. నా గార్డియన్ రోమి సర్. సుదీర్ఘ కెరీర్ కొనసాగించాలని ఆయన నాకు చెబుతూ ఉంటారు’ అని వైభవ్ పేర్కొన్నాడు (Vaibhav Sooryavanshi Innings).
