Tuesday, February 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
Homeఆంధ్రప్రదేశ్నియోజకవర్గంలో టీటీడీ ఆలయాల అభివృద్ధిని సమీక్షించండి - Mahaaprabha

నియోజకవర్గంలో టీటీడీ ఆలయాల అభివృద్ధిని సమీక్షించండి – Mahaaprabha

📰 Generate e-Paper Clip

  • టిటిడి ఈఓ, జేఈఓ లకు ఎమ్మెల్యే ఆదిమూలం వినతి
  •  కొత్తగా భాద్యతలు స్వీకరించిన జేఈఓ శరత్ కుమార్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలుమహాప్రభ ప్రతినిధిజనవరి 28 (సత్యవేడు) సత్యవేడు నియోజకవర్గంలోని టిటిడి ఆలయాల అభివృద్ధిని సమీక్షించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టిటిడి ఈఓ అశోక్ సింఘాల్, జేఈఓ శరత్ కుమార్ లను కోరారు.బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి లోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనానికి చేరుకొని కొత్తగా భాద్యతలు స్వీకరించిన జేఈఓ శరత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణవనం, నాగలాపురం లలో టిటిడి ఆలయాలు ఉన్నాయని, సత్యవేడు లో టిటిడి కల్యాణ మండపం నిర్మాణంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.అలాగే కేవిబి పురం లో కొత్తగా టిటిడి కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే నియోజకవర్గంలో పర్యటించి ఆలయాలను సందర్శించాలని ఎమ్మెల్యే ఆదిమూలం జేఈఓ శరత్ కుమార్ ను ఆహ్వానించారు.ఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా ఆయనతో ఎమ్మెల్యే మాట్లాడి నియోజకవర్గానికి ఆహ్వానించారు.తన వినతులకు ఈఓ, జేఈఓలు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!