ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంనా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

📰 Generate e-Paper Clip

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు….

  • ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలా?
  • తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం

చెన్నై, ఫిబ్రవరి 16 మహాప్రభ : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘తమిళ రాజకీయాల్లో ఉన్నతమైన పార్టీ పదవిలో ఉంటూ ఇంతటి అసహ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని నేను ఊహించలేదు’ అంటూ మండిపడ్డారు. ఇటీవల నయినార్‌ నాగేంద్రన్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘విజయ్‌కి ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. అంతకంటే ముందు అతను త్రిష నుంచి దూరమైతేనే వాస్తవాలను గ్రహించగలడు’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో త్రిష.. నయినార్‌ నాగేంద్రన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ త్రిషకు సంబంధాలు లేవని, అలా ఉండాలనే ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని, అన్ని పార్టీలతో తటస్థ వైఖరినే అవలంబిస్తానని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక వివాద వస్తువుగా మార్చొద్దని ఆమె నయినార్‌ నాగేంద్రన్‌కు హితవు పలికారు. కాగా, అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నయినార్‌ నాగేంద్రన్‌ విచారం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో నటి త్రిష గురించిన మాట తప్పుగా దొర్లిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!