ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లో దూబె ఔటయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 31 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే ప్రారంభమైంది. సోమవారం గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కాగా తొలి మ్యాచ్‌లో ఆర్ఆర్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లో దూబె ఔటయ్యాడు.క్రీజులోకి వచ్చిన తర్వాత తొలి బంతికే సిక్సర్ బాదిన దూబె.. ఆ దూకుడును ఎక్కువ సేపు కొనసాగించలేకపోయాడు. జడ్డూ బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో జడేజా ‘గన్ షాట్’ సైగలతో వికెట్ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. తాజాగా ఆ విషయంపై జడ్డూ వివరణ ఇచ్చాడు. తాను ఎందుకు అలా చేశాడో చెప్పాడు.
‘దూబె నాకు చాలాకాలంగా తెలుసు. మేమిద్దరం కలిసి నెట్స్‌లో సాధన చేశాం. అతడికి బౌలింగ్ చేస్తుండేవాడిని. అతడు ఎలా ఆలోచిస్తాడో నాకు బాగా తెలుసు. అందుకోసం నేను సన్నద్ధమయ్యా. దూబెకు ఆఫ్ స్టంప్ ఆవల బంతిని విసిరా. స్పిన్ బౌలింగ్‌లో అతడు భారీ షాట్లు కొట్టగలడు. నేను అనుకున్నవిధంగా బంతిని సంధించి వికెట్ తీశా. అందుకే సరదాగా ఆ గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నా. అందులో మరో ఉద్దేశం ఏమీ లేదు. గువాహటి పిచ్ బౌలింగ్‌కు బాగుంది. బంతి బాగా టర్న్ కావడంతో బౌలింగ్‌ను ఆస్వాదించా. సరైన ప్రాంతంలో బంతిని విసిరితే ఫలితం అనుకూలంగా వస్తుంది. అదే చేశా. క్రికెట్లో ఏదీ తేలికగా రాదు. కష్టపడాలి. వంద శాతం శ్రమించి ప్రదర్శన చేయాలి’ అని జడ్డూ వెల్లడించాడు.
