ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

దారుణం… వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

📰 Generate e-Paper Clip

తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరుపతి ఏప్రిల్ 4 (మహాప్రభ) : తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2న గురువారం తెల్లవారుజామున అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ అక్కారంపల్లి రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాబుతో ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళపై దారుణంగా వికృత చేష్టలు చేయడంతో పాటు ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టాడు.

ఈ ఘటనతో మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. భర్త విదేశాల్లో ఉండటంతో పుట్టింటికి వెళ్లి బంధువుల సహాయంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటి యజమాని శ్రీనివాసులు రెడ్డిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!