మెదక్ జిల్లా – ఫిబ్రవరి 18 ( మహాప్రభ )
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి కేసీఆర్ ని వారి వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
