మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు అందించేలా మున్సిపల్ శాఖ SOP జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు..
అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు అందించేలా మున్సిపల్ శాఖ SOP జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే ఆయా మున్సిపల్ కమిషనర్లను ఉపేక్షించేది లేదంటూ హుకుం జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయాలని కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.నేజీల గుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు వెళ్తున్నట్లయితే వెంటనే మార్చాలని సూచించారు. డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే డిసిల్టేషన్ చేయాలని మార్గనిర్దేశం చేశారు. తాగునీటిపై ఫిర్యాదులు, సీజనల్ వ్యాధులపై 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, డ్రెయిన్ల క్లీనింగ్‌లో అశ్రద్ద వహిస్తే.. మున్సిపల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని బాధ్యులను చేస్తామని హెచ్చిరించారు. వార్డు శానిటేషన్ సెక్రటరీ క్షేత్రస్థాయి తనిఖీల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
