ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజగిత్యాలజగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

📰 Generate e-Paper Clip

ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్టానం కేటాయించింది.

జగిత్యాల, ఫిబ్రవరి 16 మహాప్రభ : తాజా.. మాజీ ఎమ్మెల్యేల మధ్య అధిపత్య పోరు నెలకొన్న వేళ.. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్టానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్‌గా ఆయన వర్గానికి చెందిన సమిండ్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవిని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు.ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కేటాయించేలా అధిష్టానం పావులు కదిపినట్లు సమాచారం. జడ్పీ, మార్కెట్ కమిటీ పదవుల్లో మీ వర్గానికి కేటాయిస్తామంటూ జీవన్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తాము సైతం కష్ట పడ్డామంటూ జీవన్‌రెడ్డితోపాటు ఆయన వర్గం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. దాంతో ఇరు వర్గాలు ప్రస్తుతానికి శాంతించినట్లు ఒక చర్చ సాగుతోంది.

కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్..

కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకొంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. హఫీజ్, కాసర్ల గోదావరిలలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!