ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఘాటెక్కిన మిర్చి ధర.. : Mahaaprabha

ఘాటెక్కిన మిర్చి ధర.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది.

  • వండర్‌హాట్‌ రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.38వేలు
  • ఏనుమాముల మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

వరంగల్ ఫిబ్రవరి 6 మహాప్రభ : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది. ఏనుమాముల మార్కెట్‌కు మిర్చి రాబడులు గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కాగా, బుధవారం వండర్‌హాట్‌ మిర్చి రూ.37,100 ధర పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.900 పెరిగి రూ.38వేలు పలకడం విశేషంవరుసగా రెండు రోజుల నుంచి మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వండర్‌హాట్‌, 341 రకాలను సాగు చేసిన రైతులకు మంచి లాభాలు వస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే యూఎస్‌ 341 రకం మిర్చికి రూ. 26,700, దీపిక రకం మిర్చికి రూ.27వేలు, తేజ రకం మిర్చికి రూ.19,500, పత్తికి రూ.7,630, మినుములకు రూ.8,602, పెసర్లకు రూ.8,352 గరిష్ఠంగా ధరలు పలికాయి.

స్వల్పంగా పడిపోయిన పత్తి ధరలు

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం రూ.7,700 ఉండగా ఒక్క రోజులో క్వింటాల్‌కు రూ.70 తగ్గి రూ.7,630కి పడిపోయింది. దీంతో ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!