ePaper
Friday, March 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్గుళ్లో పెళ్లి చేసుకుందామంటే నమ్మి వెళ్లిన యువతి! చివరకు..

గుళ్లో పెళ్లి చేసుకుందామంటే నమ్మి వెళ్లిన యువతి! చివరకు..

📰 Generate e-Paper Clip

ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగినట్టు గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో యువకుడిని తాజాగా అరెస్టు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 28 మహాప్రభ : ఒడిశాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగిందని గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఆదివారం (ఫిబ్రవరి 22) బాధితురాలు తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు తిర్తోల్‌లోని ఓ గుడికి వెళ్లింది. అయితే, చివరి నిమిషంలో అతడు ఆమెను మోసం చేశాడు. చుట్టుపక్కల అంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆపై యువతిని సమీపంలోని ఓ బస్‌స్టాండ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

ఆ తరువాత, ఓ అపరిచిత యువకుడు అటుగా వెళుతూ యువతికి లిఫ్ట్ ఆఫర్ చేశాడు. తన టూవీలర్‌పై ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని అన్నాడు. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇవేవీ గుర్తించని యువతి అతడి వెంట బయలుదేరింది. ఈ క్రమంలో నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసు కేసు పెడతానని యువతి బెదిరించడంతో ఆమెను నాల్గవ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్రగాయాల పాలైన యువతి ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. మరోవైపు యువతి కనబడట్లేదంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.యువతి మృతి గురించి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే ప్రాంతంలో మిస్సింగ్ కేసు గురించి కూడా తెలియడంతో యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇక యువతిపై అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ క్రమంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!