దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. పీఎం-కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 10 మహాప్రభ : దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) శుభవార్త(Good News) చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధులు.. ఈ 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32 కోట్ల మంది రైతుల(Farmers) ఖాతాల్లో రూ.2000 వేల చొప్పున జమ కానున్నాయి. అస్సాంలోని (Assam) గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం-కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రతి ఏటా మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.19వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా అన్నదాతలకు ఈ నిధులు అందించబడ్డాయి. కాగా, ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం-కిసాన్‌తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
