ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిగుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 – 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది.

అమరావతి, మార్చి 25 ( మహాప్రభ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 – 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. 2026 – 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని తెలిపింది. 2026 – 2027 డిస్కమ్‌ల లోడ్ 15,790 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానని ముందుకు రావడంతో వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది.2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల విధింపు కూడా నిలిపివేసినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపు నుంచి మినహాయింపు దక్కనుంది. ప్రభుత్వం వాణిజ్య వినియోగదారులకు ఊరట నిచ్చేలా యూనిట్‌ ధరను 12.25 రూపాయల నుంచి 9. 95 రూపాయలకు తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు.. కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితిని 10 హెచ్‌‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంచింది. రాష్ట్రంలోని 18 వేల మంది కుటీర పరిశ్రమల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!