వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.
అమరావతి, ఫిబ్రవరి 20 మహాప్రభ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు. సీబీఐ అధికారుల నివేదికలు ఉన్నా ‘క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిన అంశంపై సమాధానం చెప్పకుండా దారి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి వేదికగా ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు పల్లా శ్రీనివాసరావు.
