ePaper
Friday, March 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్కావ్యపాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!

కావ్యపాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!

📰 Generate e-Paper Clip

ఐపీఎల్‌లో స‌న్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం.

స్పోర్ట్స్ డెస్క్ మార్చ్ 25 ( మహాప్రభ ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యంలో కీలక మార్పు జరిగింది. డియాజియో గ్రూప్ నుంచి ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా రూ.16,700 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ఆర్సీబీ జట్టుకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదే సమయంలో కుమార్ మంగళం కుమార్తె అనన్య బిర్లా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ఓ ఐకాన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగళురూ జట్టుకు అనన్య బిర్లా కూడా అదే స్థాయిలో గుర్తింపు తెస్తారని అభిమానులు భావిస్తున్నారు. పంజాబ్ జట్టుకు ప్రీతి జింటా, హైదరాబాద్ జట్టుకు కావ్య మారన్ లాగానే ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ‘మాకు కూడా ఓ బ్యూటీ(అనన్య పాప) వచ్చేసింది’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు స్టేడియంలో అనన్య రాకతో ఐపీఎల్ మరింత కలర్‌ఫుల్‌గా మారడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

అనన్య బిర్లా ఎవరంటే?

ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తె అనన్య బిర్లా. ఆమె ఒక పారిశ్రామికవేత్తగా, పెట్టుబడిదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1994లో ముంబైలో జన్మించిన ఆమె, అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ అర్థశాస్త్రం నిర్వహణను అభ్యసించారు. ఈ సమయంలో, ఆమె వ్యాపారం, సంగీతం రెండింటిపై ఫోకస్ చేశారు. అనన్య బిర్లా 17 ఏళ్ల ప్రాయంలోనే ‘స్వతంత్ర మైక్రోఫైనాన్స్’ అనే సంస్థను స్థాపించి, గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని పలు కీలక వ్యాపార బాధ్యతలను అనన్య బిర్లా పర్యవేక్షిస్తున్నారు. మానసికఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ఎమ్ పవర్(Mpower)’ అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నడుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!