తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించిందంటే..
హైదరాబాద్, ఫిబ్రవరి13 మహాప్రభ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించిందంటే..
1. ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఈ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకొంది. తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో సత్తా చాటారు. దీంతో తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడింది.
- ఆలేరు (12) : కాంగ్రెస్
- భువనగిరి (35) : కాంగ్రెస్
- చౌటుప్పల్ (20) : కాంగ్రెస్
- మోత్కూరు (12) : కాంగ్రెస్
- పోచంపల్లి (13) : కాంగ్రెస్
- యాదగిరిగుట్ట (12) : కాంగ్రెస్
- హుజూర్నగర్ (28) : కాంగ్రెస్
- కోదాడ (35) : కాంగ్రెస్
- నేరేడుచర్ల (15): కాంగ్రెస్
- సూర్యాపేట (48) : కాంగ్రెస్
- తిరుమలగిరి (15) : బీఆర్ఎస్
- చండూర్ (10) : కాంగ్రెస్
- చిట్యాల (12) : కాంగ్రెస్
- దేవరకొండ (20) : కాంగ్రెస్
- హాలియా (12) : కాంగ్రెస్
- మిర్యాలగూడ (48): కాంగ్రెస్
- నందికొండ (12): కాంగ్రెస్
2. ఉమ్మడి మెదక్ జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఈ జిల్లా. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ.. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో పలు మునిసిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
- చేర్యాల (12): బీఆర్ఎస్
- దుబ్బాక (20) : బీఆర్ఎస్
- గజ్వేల్ (20) : బీఆర్ఎస్
- హుస్నాబాద్ (20): కాంగ్రెస్
- అందోలు – జోగిపేట (20) : కాంగ్రెస్
- గడ్డపోతారం (18) : బీఆర్ఎస్
- గుమ్మడిదల (22) : బీఆర్ఎస్
- ఇంద్రేశం (18) : బీఆర్ఎస్
- ఇస్నాపూర్ (26) : బీఆర్ఎస్
- జిన్నారం (20) : బీఆర్ఎస్
- కోహిర్ (16) : కాంగ్రెస్
- నారాయణ్‌ఖేడ్ (15) : కాంగ్రెస్
- సదాశివపేట్ (26) : కాంగ్రెస్
- సంగారెడ్డి (38) : కాంగ్రెస్
- జహీరాబాద్ (37) : బీఆర్ఎస్
- మెదక్ (32) : కాంగ్రెస్
- నర్సాపూర్ (15) : కాంగ్రెస్
- రామాయంపేట (12) : కాంగ్రెస్
- తూప్రాన్ (16) : కాంగ్రెస్
3. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా..
- భూత్పూర్ (10) : కాంగ్రెస్
- దేవరకద్ర (12) : కాంగ్రెస్
- కోస్గి (16) : కాంగ్రెస్
- మద్దూరు (16) : కాంగ్రెస్
- మక్తల్ (16) : కాంగ్రెస్
- నారాయణపేట (24)
- అలంపూర్ (10): హంగ్ (కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 గెలుచుకుంది).
- గద్వాల్ (37) : కాంగ్రెస్
- అయిజ (20): బీఆర్ఎస్
- వడ్డేపల్లి (10): ఇతరులు 8 వార్డుల్లో గెలుపొందారు. కాంగ్రెస్ (1), బీఆర్ఎస్ (1) గెలుచుకుంది.
- అమరచింత (10) : కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 1 (హంగ్)
- ఆత్మకూరు (10) : కాంగ్రెస్
- కొత్తకోట (15) : కాంగ్రెస్
- పెబ్బేరు (12) : కాంగ్రెస్
- వనపర్తి (33) : కాంగ్రెస్
- కల్వకుర్తి (22) : కాంగ్రెస్
- కొల్లాపూర్ (19) : కాంగ్రెస్
- నాగర్‌కర్నూలు (24): కాంగ్రెస్
- షాద్‌నగర్ (28) : కాంగ్రెస్
- కొడంగల్ (12) : కాంగ్రెస్
- ఆమనగల్ (15) : కాంగ్రెస్
4. ఉమ్మడి వరంగల్ జిల్లా..
- జనగామ (30): బీఆర్ఎస్
- స్టేషన్ ఘన్పూర్ (18): కాంగ్రెస్
- నర్సంపేట (30) : కాంగ్రెస్
- వర్ధన్నపేట (12) : కాంగ్రెస్
- హనుమకొండ: కాంగ్రెస్
- పరకాల (22) : కాంగ్రెస్
- డోర్నకల్ (15) : కాంగ్రెస్
- కేసముద్రం (16) : హంగ్ (కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8).
- మహబూబాబాద్ (36)
- మరిపెడ (15) : కాంగ్రెస్
- తొర్రూర్ (16): బీఆర్ఎస్
- భూపాలపల్లి (30) : కాంగ్రెస్
- ములుగు (20): కాంగ్రెస్
5. ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
- చొప్పదండి (14) : కాంగ్రెస్
- హుజూరాబాద్ (30) : కాంగ్రెస్
- జమ్మికుంట (30): బీఆర్ఎస్
- ధర్మపురి (15) : కాంగ్రెస్
- జగిత్యాల (50): కాంగ్రెస్
- కోరుట్ల (33) : కాంగ్రెస్
- మెట్పల్లి (26) : కాంగ్రెస్
- రాయికల్ (12) : కాంగ్రెస్
- సిరిసిల్ల (39): బీఆర్ఎస్
- వేములవాడ (28): కాంగ్రెస్
- మంథని (13) : కాంగ్రెస్
- పెద్దపల్లి (36) : కాంగ్రెస్
- సుల్తానాబాద్ (15) : కాంగ్రెస్
6. ఉమ్మడి ఖమ్మం జిల్లా..
ఏదులాపురం (32) : కాంగ్రెస్
కల్లూరు (20) : కాంగ్రెస్
మధిర (22) : కాంగ్రెస్
సత్తుపల్లి (23) : కాంగ్రెస్
వైరా (20) : కాంగ్రెస్
అశ్వారావుపేట (22) : కాంగ్రెస్
ఇల్లెందు (24) : కాంగ్రెస్
7. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..
ఆదిలాబాద్ (49): బీజేపీ (21)
భైంసా (26): కాంగ్రెస్
ఖానాపూర్ (12): కాంగ్రెస్
నిర్మల్ (42): కాంగ్రెస్
ఆసిఫాబాద్ (20): బీఆర్ఎస్
కాగజ్ నగర్ (30): హంగ్.. (కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10)
బెల్లంపల్లి (34) : హంగ్.. (కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14)
చెన్నూరు (18): కాంగ్రెస్
క్యాతనపల్లి (22): బీఆర్ఎస్
లక్షెట్టిపేట (15): కాంగ్రెస్
8. రంగారెడ్డి
చేవెళ్ల (18)
ఇబ్రహీంపట్నం (24)
మొయినాబాద్ (26)
శంకర్పల్లి (15)
పరిగి (18)
తాండూర్ (36)
వికారాబాద్ (34)
అలియాబాద్ (20)
మూడుచింతలపల్లి (24)
ఎల్లంపేట (24)
9. నిజామాబాద్
ఆర్మూరు (36)
భీమ్‌గల్ (12)
బోధన్ (38)
బాన్సువాడ (19)
బిచ్కుంద (12)
కామారెడ్డి (49)
ఎల్లారెడ్డి (12)
