ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
అమరావతి, ఫిబ్రవరి 14 మహాప్రభ : ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపు వివరాలు ఇవే:
- రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
- రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
- వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
- పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
- సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు
- జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు
2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు:
- మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు
- అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు
- పోలవరం – రూ.6,105 కోట్లు
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
- మత్స్యకార సేవలో – రూ.260కోట్లు
- పంటల బీమా – రూ.250 కోట్లు
- పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు
సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:- ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు
- దీపం 2.0 – రూ.2,601 కోట్లు
- వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు
- స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు
- వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు
- ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు
- తల్లికి వందనం – రూ.9,668 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు
- ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు
- సమగ్ర శిక్ష – రూ.2,946 కోట్లు
- ఉన్నత విద్య – రూ.2,566 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు
- మన బడి, మన భవిష్యత్ – రూ.1,500 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు
- పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు
- సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర – రూ.654 కోట్లు
- యువత, క్రీడలు – రూ.438 కోట్లు
