ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఎవరీ వడాపావ్ గర్ల్.. భర్త వల్ల నరకం చూస్తున్నానంటూ ఎమోషనల్ వీడియో.. : Mahaaprabha

ఎవరీ వడాపావ్ గర్ల్.. భర్త వల్ల నరకం చూస్తున్నానంటూ ఎమోషనల్ వీడియో.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

చంద్రికా దీక్షిత్ అనే యువతి ఢిల్లీలో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన ఆమె తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ ఫిబ్రవరి 5 మహాప్రభ : తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనకు నరకం చూపిస్తున్నాడంటూ బిగ్‌బాస్ బ్యూటీ, వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రికా దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన చంద్రిక‌ ఢిల్లీలో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Vada Pav Girl Chandrika Dixit).తన భర్త యుగం గేరాపై చంద్రిక తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొంది. అన్నింటినీ మౌనంగా భరిస్తున్నానని, ఒకవైపు ఇంటిని, మరోవైపు కొడుకును చూసుకుంటూ అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వహిస్తున్నా భర్త మాత్రం వేరే అమ్మాయితో తిరుగుతుంటే నరకం చూస్తున్నానని పేర్కొంది. ఫోన్‌లో తన భర్త చాటింగ్ స్క్రీన్ షాట్‌ను, వేరే అమ్మాయితో ఉన్న ఫోటోలను కూడా వీడియోలో చూపించింది (Chandrika Dixit latest video).

తన భర్త ఫోన్‌లో చూసిన ఫొటోలు తనను చిత్రవధ చేస్తున్నాయని, తన మెదడును పని చేయనివ్వడం లేదని చంద్రిక ఆవేదన వ్యక్తం చేసింది (Chandrika Dixit marriage issue). భార్య ఆరోపణలపై యుగం గేరా స్పందించాడు. ‘తప్పు ఒప్పుకుంటున్నాను. కానీ అదేమంత పెద్దది కాదు. సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నావ్.. నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. నీ రెస్టారెంట్ నా వల్లే నడుస్తోందని గుర్తుపెట్టుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వీరి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!