నార్కెట్‌పల్లి – మార్చ్ 25 ( మహాప్రభ ) : నల్గొండ జిల్లా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, ప్రజల హక్కులను తిరిగి కల్పించడంతోపాటు పంచాయతీల పాలనాధికారాన్ని పునరుద్ధరించాలని, వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య ముఖ్యఅతిధి స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నార్కట్ పల్లి మండలం నార్కట్ పల్లి, గోపలాయపల్లి, ఎలుగులదోరి, చౌడంపల్లి, బ్రాహ్మణ వెల్లంల అలాగే వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ లబ్ధిదారులతో ముచ్చటించి, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తూ, గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారులను నిర్వీర్యం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో మేము సైతం అంటూ గ్రామ గ్రామాన ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి వారికి మేము అండగా ఉంటామని తెలుపుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం మార్పును ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదని అందుకు ఉపాధి కూలీలతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలను తీసుకురావద్దని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలని, వి బి జి రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, డిమాండ్ చేశారు. ఉపాధి హక్కు పథకం వలన గతంలో ప్రజలు సంవత్సరానికి వంద రోజులు పని హక్కు ఉండేదని, కానీ ఇప్పుడు వి బి జి రామ్ చట్టం వలన కూలీల పని అవకాశాలు తగ్గి, తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
