ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఉత్తర ప్రదేశ్‌ఇలా జరిగిందేంటి.. మరీ ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా?..

ఇలా జరిగిందేంటి.. మరీ ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా?..

📰 Generate e-Paper Clip

ఓ మహిళ పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం చేసింది. అది కూడా ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా బంగారు నగను తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.

ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : ఓ మహిళ పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం చేసింది. అది కూడా ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా బంగారు నగను తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అయోధ్య, రుదౌలీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అగర్వాల్ కాంప్లెక్స్‌లో ఓ బంగారు నగల షాపు ఉంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ ఆ షాపునకు వచ్చింది. బంగారు నగలు చూపించమని అడిగింది. షాపు యజమాని చాలా నగల్ని చూపించాడు.

ఆమె ఓ నగను ఎంపిక చేసుకుంది. అయితే, పేమెంట్ విషయంలో ఆలస్యం చేయసాగింది. పైకి లేచి కొద్దిసేపు అటు, ఇటు తిరిగింది. షాపు యజమాని కౌంటర్ దగ్గరినుంచి కొంచెం పక్కకు వెళ్లగానే దొంగతనానికి పాల్పడింది. కౌంటర్ మీద ఉంచిన బంగారు నగని చేతుల్లోకి తీసుకొని పారిపోయింది. తనను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు గన్‌ను బయటకు తీసి బెదిరించింది. అయితే, ఆమె ఏ ఆటంకం లేకుండానే అక్కడినుంచి ఈజీగా.. క్షణాల్లో తప్పించుకుని పారిపోయింది. షాపు యజమాని, మరో వ్యక్తి ఆమె వెనకాలే పరుగులు తీశారు.

మహిళ దొంగతనం చేసిన నగ బరువు 26 గ్రాములు ఉంటుందని సమాచారం. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దొంగతనం మరీ ఇంత ఈజీగా చేయొచ్చని నాకు తెలీదు’..‘దొంగతనం చేయడానికి సరైన షాపును ఎంచుకుంది. వాస్తవానికి తుపాకి కూడా అవసరం లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!