ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఇరాన్‌లో మళ్లీ విద్యార్థుల ఆందోళన

ఇరాన్‌లో మళ్లీ విద్యార్థుల ఆందోళన

📰 Generate e-Paper Clip

ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గత నెలలో జరిగిన ఆందోళనను ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో సద్దుమణిగినట్టు….

  • నియంతకు మరణం అంటూ నినాదాలు

టెహ్రాన్‌, ఫిబ్రవరి 23 మహాప్రభ : ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గత నెలలో జరిగిన ఆందోళనను ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో సద్దుమణిగినట్టు కనిపించినా శనివారం మళ్లీ మతపాలకులకు నిరసన తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. టెహ్రాన్‌లోని షరీఫ్‌ ఇంజినీరింగ్‌ యూనివర్సిటీ విద్యార్థులు ‘బి షరఫ్‌’ (సిగ్గుచేటు) అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమెనెయ్‌ను ‘హంతక నేత’గా అభివర్ణించారు. ప్రవాసంలో ఉన్న రాకుమారుడు రెజా పహ్లవీ రాజుగా బాధ్యతలు చేపట్టాలని డిమాండు చేశారు. టెహ్రాన్‌లోని బెహెస్తీ, అమిర్‌ కబీర్‌ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. నిరసనలకు కేంద్రస్థానంగా ఉన్న అబ్దానన్‌ పట్టణంలో విద్యార్థులు ‘నియంతకు మరణం’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న టీచరును అరెస్టు చేయడంతో సుప్రీంలీడర్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!