ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్.. 22 ఏళ్ల తర్వాత..

ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్.. 22 ఏళ్ల తర్వాత..

📰 Generate e-Paper Clip

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు 22 ఏళ్ల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 25 మహాప్రభ : ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్(Bangladesh) వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం ఏకంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టుకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆ జట్టు 22 ఏళ్ల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది.తొలి టెస్ట్‌ మ్యాచ్‌ డార్విన్‌ వేదికగా ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 17 వరకు జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డార్విన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చివరగా 2004లో ఇక్కడ శ్రీలంక, ఆస్ట్రేలియా(Australia) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇక బంగ్లా, ఆసీస్ రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్టు 22 – 26 మధ్య జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ బంగ్లాదేశ్‌, ఆసీస్ మధ్య నాలుగో సిరీస్‌ అవుతుంది. 2017లో మీర్పూర్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది. మరోవైపు బంగ్లాతో స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌తోనే 2026-27 సీజన్‌ ఆసీస్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది.
బంగ్లాతో టెస్ట్ సిరీస్‌ అనంతరం ఆసీస్‌ మూడు టెస్ట్‌ల కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఆ తర్వాత నవంబర్‌ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్‌ జట్టు నాలుగు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియాకు రానుంది. అనంతరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో 5 మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ జరగనుంది. ఆ తర్వాత మార్చిలో ఇంగ్లండ్‌తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్‌ పర్యటన.. భారత్‌లో(Team India) ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ వివరాలు రావాల్సి ఉంది. కాగా.. ఎన్నో అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్‌-2026లో బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్‌ దశలోనే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!