ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఆదాయార్జనలో మస్క్‌ రికార్డు : Mahaaprabha

ఆదాయార్జనలో మస్క్‌ రికార్డు : Mahaaprabha

📰 Generate e-Paper Clip

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆదాయార్జనలో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్నారు. స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ ఏఐ విలీనంతోపాటు, టెస్లా షేర్ల విలువ కూడా పెరగడంతో ప్రపంచంలోనే….

  • 800 బిలియన్‌ డాలర్లు దాటిన సంపద

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 మహాప్రభ : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆదాయార్జనలో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్నారు. స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ ఏఐ విలీనంతోపాటు, టెస్లా షేర్ల విలువ కూడా పెరగడంతో ప్రపంచంలోనే 800 బిలియన్‌ డాలర్ల నికర సంపదను అధిగమించిన మొదటి వ్యక్తిగా మాస్క్‌ రికార్డులకెక్కారు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం మస్క్‌ రాకెట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌, కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ఏఐ విలీనం తర్వాత ఆయన వ్యక్తిగత సంపద భారీగా పెరిగి 852 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.70లక్షల కోట్లు)కు చేరుకుంది. గత నాలుగైదు నెలలుగా మస్క్‌ సంపద జెట్‌ స్పీడుతో పెరుగుతూ పోతోంది. ఇదే వేగం కొనసాగితే.. మరికొన్ని రోజుల్లోనే ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ (1 ట్రిలియన్‌ డాలర్ల సంపద) అయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!