ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

📰 Generate e-Paper Clip

అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

విశాఖపట్నం ఏప్రిల్ 1 (మహాప్రభ) : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి(PM Narendra Modi) హోంమంత్రి అనిత(Home Minister Anithas) ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ‌రావ‌తిపై పోరాడి విజ‌యం సాధించిన రైతుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఇది రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితమన్నారు. అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని పునఃప్రతిష్ఠించిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పక్షాలకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!