ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: KCR

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: KCR

📰 Generate e-Paper Clip

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మహాప్రభ -హైదరాబాద్, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Former Minister KTR) సంతాపం తెలియజేశారు. అజిత్ పవార్ మరణ వార్త విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. అజిత్ పవార్ మృతి ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!