mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:14 pm Digital Edition : MAHAA PRABHA DAILY

700 మందికి లేఆఫ్‌లు.. టాప్ లీడర్స్‌కు రూ.8,600 కోట్లు..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా తాజాగా 700 మందికి ఉద్వాసన పలికింది. అయితే, అంతకు ముందు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ కొత్త స్టాక్ ఆప్షన్లు ప్రకటించింది.

మార్చి 26 (మహాప్రభ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా తాజాగా 700 మందికి ఉద్వాసన పలికింది. అయితే, అంతకు ముందు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ కొత్త స్టాక్ ఆప్షన్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కారణంగా వచ్చే ఐదేళ్లలో సీనియర్ ఉద్యోగులకు వేతన పరిహారం దాదాపు 921 మిలియన్ డాలర్లు (రూ.8600 కోట్లు) మేర పెరగనుంది (Meta layoffs 2026).కాగా, మెటాలోని రియాల్టీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్‌బుక్ విభాగాల నుంచి 700 మందిని తొలగించినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా, రియాల్టీ ల్యాబ్స్ డివిజన్‌లో ఉద్యోగులను తొలగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో రియాల్టీ ల్యాబ్స్ విభాగం నుంచి వెయ్యి మంది ఉద్యోగులను మెటా తొలగించింది. ఏఐ రంగంలో పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలోనే మెటా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది (Meta executive stock options).ఈ ఏడాది మొత్తం 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మెటా నిర్ణయించుకున్నట్టు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి (Meta employee layoffs news). ఈ ప్రణాళికలో భాగంగానే తాజా తొలగింపులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా లేఆఫ్‌లు ఎదుర్కొన్న వారిలో కొందరికి కంపెనీలోనే ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఏఐ శకంలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడకూడదనే ఉద్దేశంతోనే వారికి వేతన పరిహారం పెంచినట్టు సంస్థ పేర్కొంది.