mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 11:47 am Digital Edition : MAHAA PRABHA DAILY

5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు ఇచ్చినట్టు తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.

వాషింగ్టన్ మార్చి 23 మహాప్రభ : మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు ఇచ్చినట్టు తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. రెండ్రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, చర్చలు సజావుగా, నిర్మాణాత్మకంగా ఉన్నాయని చెప్పారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి చేరుకోగా, తొలిసారి ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు తగ్గేందుకు అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.దీనికి ముందు, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ గడువు ముగుస్తుండటంతో ట్రంప్ తాజాగా ఐదు రోజుల పాటు దాడులకు బ్రేక్ వేస్తున్నట్టు ప్రకటించారు.