హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు(సోమవారం) అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్ మొత్తం దట్టమైన పొగ అలముకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బిల్డింగ్ సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో సెల్లార్‌లోని 15 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.