mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 6:32 am Digital Edition : Namastey Mahaaprabha

హైదరాబాద్‌‌లో రూ.15 లక్షల బ్యాగ్‌ చోరీ… ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. కలెక్షన్ ఏజెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.15 లక్షల బ్యాగ్‌ను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారు.

హైదరాబాద్ మే 12 ( మహాప్రభ ) : పంజాగుట్టలో 15 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్‌ చోరీకి గురవడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలెక్షన్ ఏజెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.15 లక్షల బ్యాగ్‌ను చాకచక్యంగా కొట్టేశారు. కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్న బాధితుడు డబ్బులు కలెక్ట్ చేసి.. వాటిని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని పంజాగుట్ట వెళ్లాడు. స్టాంప్స్ కొనేందుకు గణేష్ స్టాంప్స్ అండ్ కో షాపు వద్ద ఆగి తన బ్యాగ్‌ను కుర్చీపై ఉంచాడు. కాసేపటికే బ్యాగ్ మాయమైందని గుర్తించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌లు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఓల్డ్ సిటీకి చెందినవారని గుర్తించారు. ముగ్గురిలో ఒకడు బాధితుడికి తెలిసిన స్నేహితుడని పోలీసులు తెలిపారు. నిందితులు ప్లాన్ ప్రకారమే బాధితుడి కదలికలను గమనించి, అతడు బ్యాగ్‌ను కుర్చీపై ఉంచగానే అవకాశం చూసి చోరీ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముగ్గురు నిందితులను పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.