హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని సీపీ సజ్జనార్ చెప్పారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని.. నగర వ్యాప్తంగా సరఫరా సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, రూమర్స్ నమ్మొద్దని, వ్యాప్తి చేయొద్దని కోరారు. మార్చి 24 మహాప్రభ : హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.నగరవ్యాప్తంగా...