హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్, మార్చి 31 (మహాప్రభ) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి చెందిన ఇల్లు సీజ్ అయింది. హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆమె ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తిపన్ను బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించివారి నుంచి ఎలాంటి స్పందన...