mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 12:13 pm Digital Edition : Namastey Mahaaprabha

హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా

పీనట్ బటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌తో పోలిస్తే ఇంట్లో తయారు చేసుకున్నది పూర్తిగా సహజంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంట్లోనే హెల్తీ పీనట్ బటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోవడం చాలా సులభం. మార్కెట్‌లో దొరికే పీనట్ బటర్‌తో పోలిస్తే ఇంట్లో తయారు చేసుకున్నది పూర్తిగా సహజంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా మనకు కావాల్సిన రుచికి అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ పాటించే వారు తమ ఆహారంలో పీనట్ బటర్‌ను ఎక్కువగా చేర్చుకుంటారు. మీరు కూడా దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్తీ పీనట్ బటర్ సింపుల్ రెసిపీ చూద్దాం..

కావలసిన పదార్థాలు:

  • వేయించిన వేరుశెనగలు – 2 కప్పులు (పొట్టు తీసినవి)
  • ఉప్పు – రుచికి తగినంత
  • తేనె లేదా బెల్లం – 1 టీస్పూన్
  • నూనె లేదా నెయ్యి – 1 లేదా 2 టీస్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా వేరుశెనగలను మధ్యస్థ మంటపై 5–7 నిమిషాలు దోరగా, మాడిపోకుండా వేయించాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి.
  • తర్వాత చల్లారిన వేరుశెనగలను మిక్సీ జార్‌లోకి తీసుకుని పౌడర్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు గ్రైండ్ చేయాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నూనె కలుపుతూ మళ్లీ బ్లెండ్ చేస్తే, వేరుశెనగలు తమ సహజ నూనెను విడుదల చేసి పేస్ట్‌లా మారతాయి.
  • చివరగా ఉప్పు, తేనె లేదా బెల్లం కలిపి బాగా మిక్స్ చేయాలి. క్రీమీగా కావాలంటే మరికొంత సేపు బ్లెండ్ చేయాలి. క్రంచీ పీనట్ బటర్ కావాలంటే చివర్లో కొద్దిగా నలిపిన వేరుశెనగలు కలపొచ్చు.
  • తయారైన పీనట్ బటర్‌ను గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది ఫ్రిజ్‌లో నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.