mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 6:41 am Digital Edition : MAHAA PRABHA DAILY

సౌదీ బేస్‌పై ఇరాన్ దాడి.. ఐదు అమెరికా విమానాలు ధ్వంసం..

ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.

మార్చి 14 మహాప్రభ : ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమైనట్టు యూఎస్ అధికారులు తెలిపారని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనం ప్రచురించింది (Iran attack Saudi base).సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడుల్లో ఐదు కేసీ-135 రీ ఫ్యూయలింగ్ విమానాల ట్యాంకర్లు దెబ్బతిన్నాయని, విమానాలు పాక్షికంగా ధ్వసంమయ్యాయని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. దెబ్బతిన్న విమానాలకు మరమ్మత్తులు కొనసాగుతున్నాయని, ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది (US refueling aircrafts hit).ఈ విమానాల ధ్వంసం గురించి స్పందించడానికి యూఎస్ సెంట్రల్ కమాండ్ నిరాకరించింది (US Air Force planes damaged). కాగా, ఇరాక్‌లో కూడా అమెరికా రిఫ్యూయలింగ్ విమానం ఒకటి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.